‘కిష్కింధపురి’లో చాలా ట్విస్టులు!

Kishkindhapuri

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన హారర్ మూవీ… ‘కిష్కింధపురి’. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమా గురించి నిర్మాత విశేషాలు పంచుకున్నారు. కథలో చాలా షాకింగ్ ట్విస్టులు ఉన్నాయట.

“ఇప్పటివరకు చాలా హారర్ కథలు వచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. హారర్, మిస్టరీ లను కలిపి దర్శకుడు కొత్తగా ఈ కథని ప్రజెంట్ చేశాడు. ఇప్పటివరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ రాలేదు అని కచ్చితంగా చెప్పగలను. ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సీరియస్ హారర్ ఫిల్మ్ గా టర్న్ అవుతుంది. దాదాపు రెండు కోట్లతో సెట్ వేయడం జరిగింది. సెట్ వెయ్యడానికే నెల రోజులు సమయం పట్టింది,” అని తెలిపారు.

కిష్కిందపురి అనే ఒక ఊర్లో జరిగే కథ ఇది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. చాలా షాక్ ఫ్యాక్టర్స్, ఆడియన్స్ భయపడే మూమెంట్స్ చాలా ఉంటాయి. ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్ గా టాప్ నాచ్ ఉంటుంది,” అని ధీమాగా చెప్పారు నిర్మాత సాహు.

ఇలాంటి సినిమాలే తీయాలనే ఒక రూల్ ఏమి పెట్టుకోలేదని అంటున్నారు సాహు. “భగవంత్ కేసరికి జాతీయ అవార్డు పొందడం అనందంగా ఉంది. పెద్ద సినిమాలే నిర్మించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బడ్జెట్ కంట్రోల్ లో తీయగలిగితేనే వర్కవుట్ అవుతాయి. ఎందుకంటే చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం పెద్ద ఛాలెంజ్ అయింది,” అని క్లారిటీ ఇచ్చారు.

More

 

Related Stories