రెండు రోజుల తర్వాత ఆగింది!

Ustaad Bhagath Singh

ఉస్తాద్ భగత్ సింగ్’ని దర్శకుడు హరీష్ శంకర్ ఏ ముహూర్తంలో అనుకున్నాడో కానీ అడుగడుగునా అడ్డంకులే తగులుతున్నాయి. మరోసారి ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.

“ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ ఈ నెల 7వ తేదీన మొదలైంది. రెండు రోజుల పాటు షూటింగ్ జరిగింది. కానీ సెప్టెంబర్ 9న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. దాంతో పవన్ కళ్యాణ్ షూటింగ్ ఆపేసి విజయవాడ వెళ్లారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఇప్పటివరకు (సెప్టెంబర్ 23) పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనలేదు.

పది రోజుల పాటు సీన్లు, ఫైట్స్ తీద్దామని దర్శకుడు హరీష్ శంకర్ భారీగా ప్లాన్ చేసుకున్నారు. కానీ రెండు రోజులకే షూటింగ్ ఆగింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం.

ఈ సినిమా మొదటి షెడ్యూలు ఏప్రిల్లో జరిగింది. అప్పుడు 8 రోజుల పాటు తీశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్లో రెండు రోజుల చిత్రీకరణ జరిగింది. అంటే మొత్తంగా 10 రోజుల పాటు ఇప్పటివరకు షూటింగ్ జరిగింది.

ఈ లెక్కన “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. తన సినిమా షూటింగ్ కోసమైనా పొలిటికల్ హీట్ తగ్గాలని హరీష్ శంకర్ “ధర్మపురి” లక్ష్మీ నరసింహస్వామి వారికి మొక్కుకోవాలేమో.

Advertisement
 

More

Related Stories