
“చంద్రముఖి 2” సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ఈవెంట్ కి రాఘవ లారెన్స్ తో పాటు దర్శకుడు వాసు, హీరోయిన్ కంగన హాజరయ్యారు.
“రజినీకాంత్‌గారు చేసిన రోల్‌లో నేను నటించటం అంటే ఆ రాఘవేంద్రస్వామిగారి అదృష్టం అని అనుకోవాలి. సూపర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్రను నేనెంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు. నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించాను,” అన్నారు లారెన్స్.
“‘నేను ఇంతకు ముందు తెలుగులో “ఏక్ నిరంజన్” చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. దర్శకుడు పి. వాసు వేరే చిత్రం కోసం నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేనే ఆయన్ని అడిగాను మీ “చంద్రముఖి 2″లో ఎవరు నటిస్తున్నారు అని. ఇంకా ఎవరినీ తీసుకోలేదని అన్నారు. అప్పుడు నేను నేను నటిస్తానని అడిగి ఈ సినిమాలోకి అడుగు పెట్టాను. “చంద్రముఖి”లో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుంది. కానీ ‘చంద్రముఖి2’లో నిజమైన చంద్రముఖి పాత్ర ఉంటుంది,” అని కంగన అన్నారు.