ఫస్ట్ అడ్వాంటేజ్ వకీల్ సాబ్ కే

- Advertisement -
Vakeel Saab

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ వ్యాపారం అప్పటికి పుంజుకోడు కాబట్టి సినిమా సమ్మర్ కి వాయిదా పడింది. ఐతే, సమ్మర్ కి చాలా సినిమాలు రానున్నాయి. అందుకే ఫస్ట్ బిగ్ రిలీజ్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నాడు దిల్ రాజు.

సో… వేసవి సెలవల్లో అన్నిటికన్నా ముందే రిలీజ్ అయ్యే మూవీ వకీల్ సాబ్. ఉగాది కానుకగా రిలీజ్ అవొచ్చు. సంక్రాంతికి ఈ విషయంలో దిల్ రాజ్ ఒక ప్రకటన చేస్తాడని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్టర్. కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి విడుదల చెయ్యాలనే ప్లాన్ తో మొదలుపెట్టిన మూవీ వకీల్ సాబ్. చివరికి ఏడాదిన్నర పట్టేలా ఉంది.

 

More

Related Stories