Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

యష్ పాత కామెంట్, కొత్త ట్రోలింగ్

TeluguCinema Team, January 15, 2026January 15, 2026
Toxic

“కేజీఎఫ్” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు కన్నడ సూపర్ స్టార్ యష్. ఆయన కొత్త చిత్రం… టాక్సిక్. ఈ సినిమా టీజర్ గత వారం యష్ పుట్టినరోజున విడుదలైంది.

ఈ టీజర్ లో ఒక కీలకమైన సీన్ ఇప్పుడు పెద్ద వివాదాన్ని సృష్టించింది. హీరో యష్ కారులో ఒక అమ్మాయితో సెక్స్ చేస్తున్నట్లు చూపించారు ఈ టీజర్లో. ఒక పెద్ద హీరో ఇండియాలో ఇప్పటివరకు అలాంటి సీన్లో యాక్ట్ చెయ్యలేదు. కుర్ర హీరోలు అలాంటి సీన్లు చేస్తారు కానీ యష్, ప్రభాస్, మహేష్ బాబు రేంజ్ పెద్ద సూపర్ స్టార్లు వీటికి దూరంగా ఉంటారు. దాంతో ఇప్పుడు యష్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను ఎలాంటి కథలు, సీన్లకి దూరంగా ఉంటానో తెలిపాడు. “నా తల్లిదండ్రులతో కలిసి చూడటానికి నేను ఇబ్బంది పడే సన్నివేశాలను నేను చేయను. వాటిని ఒప్పుకోను,” అని అన్నాడు యష్. ఇది నా ప్రామిస్ అని కూడా అన్నాడు.

దాంతో, ఇప్పుడు యష్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆ సీను మీ తల్లితండ్రులతో కలిసి ఇంట్లో హాల్లో పెద్ద స్క్రీన్ మీద చూస్తావా అని అడుగుతున్నారు.

మార్చి 19న “టాక్సిక్” విడుదల కానుంది. ఈ సీన్లో నటించిన విదేశీ హీరోయిన్ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో తన అకౌంట్ ని డీయాక్టివేట్ చేసింది. ఆమెకి అంత ట్రోలింగ్ సెగ తగిలింది మరి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Ritika Nayak
    తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak
  • Katrina Kaif
    Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Akhil Akkineni, Zainab Ravdjee
    తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Devara
    Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

Recent News

  • తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak
  • Irumudi డేట్ లో మార్పు లేదు, నిర్మాతల ప్రకటన
  • Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!
  • తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes