
అల్లు అర్జున్ ఇప్పటికే నార్త్ ఇండియా మార్కెట్ ని క్యాప్చర్ చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చెయ్యకుండా హిందీ మార్కెట్ ని కొల్లగొట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మొదటి తెలుగు హీరో అల్లు అర్జున్. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కేవలం రాజమౌళి సినిమాల వల్లే మార్కెట్ పెరిగింది. కానీ అల్లు అర్జున్ తన ప్లానింగ్ తో రాజమౌళి సినిమా చెయ్యకుండా సంపాదించుకున్నాడు. ఈ ముగ్గురి హీరోలకన్నా పెద్ద హిట్ కొట్టాడు హిందీలో “పుష్ప 2″తో.
ఇక ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కి రాజమౌళి సినిమాల వల్లే జపాన్ లో ఎంతోకొంత క్రేజ్, మార్కెట్ ఉంది. దాన్ని వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఫోకస్ పెట్టి పెట్టాడు. తాజాగా “పుష్ప 2” జపాన్ లో విడుదలైంది. ఈ రోజు నుంచి అక్కడ థియేటర్లలో రన్ అవుతోంది.
అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి పబ్లిసిటీ మొదలుపెట్టాడు. హీరోయిన్ రశ్మికతో కలిసి అక్కడ ప్రచారం చేస్తున్నాడు. జపాన్ లో కూడా తనకి సొంతంగా మార్కెట్ సృష్టించుకునే ప్లానింగ్ మొదలుపెట్టాడు.
అల్లు అర్జున్ కి ఇప్పటికే ఇండియాలో తెలుగు రాష్ట్రాలు కాకుండా, హిందీలో, మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇద్దరు తమిళ దర్శకులతో తన తదుపరి చిత్రాలు చేస్తున్నాడు. వారి వల్ల తమిళ మార్కెట్ కూడా క్యాప్చర్ చేసుకునేవిధంగా లెక్కలు వేశారు.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అది షూటింగ్ లో ఉండగానే లోకేష్ కనకరాజ్‌తో సినిమాను ప్రకటించాడు. ఇలా కొత్త మార్కెట్ లపై ఫోకస్ నిలిపాడు అల్లు అర్జున్.
