
తమిళ సూపర్ స్టార్ విజయ్ చెప్పిన డైలాగ్ ల్లో “ఐ యామ్ వెయిటింగ్” అనేది చాలా పాపులర్. ఇప్పుడు హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఇదే డైలాగ్ రియల్ లైఫ్ లో చెప్తోంది. ఎందుకంటే ఆమె కూడా వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితిలో పడింది.
పూజ హెగ్డేకి తెలుగులో ఒక్క సినిమా తప్ప మరో మూవీ లేదు. హిందీలో కూడా క్రేజ్ లేదు. ఆమె ఆశ అంతా తమిళ సినిమాలపైనే. విజయ్ చివరి చిత్రం “జన నాయగన్”లో నటించింది. సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదలై భారీ హిట్ అయి తనకి 2026 స్టార్టింగ్ లోనే మంచి బూస్టప్ తెస్తుంది అని లెక్కలు వేసుకొంది. ఐతే ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.
కోర్టులో ఈ సినిమా కేసు నడుస్తోంది. ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి. విజయ్ కి ఇది రాజకీయంగా ఇంపార్టెంట్. కాబట్టి అతను తొందరపడడం లేదు. పూజ హెగ్డే కూడా చేసేదేమి లేదు. అందుకే ఆమె కూడా వెయిటింగ్ అన్నట్లుగా ఉంది.
ఈ సినిమాతో పాటు ఏడాది ఆమె మరో తమిళ చిత్రం “కాంచన 4″లో కూడా కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలు ఆమె తమిళ కెరీర్ కి ఇంపార్టెంట్.
