
సాయి పల్లవి హిందీలోకి అడుగుపెట్టింది. రెండేళ్ల క్రితమే రెండు బాలీవుడ్ సినిమాలు సైన్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఐతే, ఆ సినిమాలు ఈ ఏడాది విడుదల అవుతున్నాయి. సో, 2026 ఆమెకి బాలీవుడ్ టైం అని చెప్పొచ్చు.
ఏక్ దిన్
సాయి పల్లవి ఒప్పుకున్న మొదటి హిందీ చిత్రం… ఏక్ దిన్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ప్రకటించింది అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్. మే 1న సినిమా విడుదల కానుంది. మొదటి పోస్టర్ ని బట్టి చూస్తే ఒక రోజు జరిగే ప్రేమకథలా కనిపిస్తోంది. థాయ్ సినిమా “వన్ డే” చిత్రానికి రీమేక్ అనిపిస్తోంది.

రామాయణ
ఇక ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ… రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడిగా దర్శకుడు నితీస్ తివారి తీస్తున్న ఈ రామాయణం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి రానుంది. సాయి పల్లవి సీతగా నటిస్తోంది.
ఈ రెండు బాలీవుడ్ చిత్రాలపై ఆమె చాలా ఆశలు పెట్టుకొంది. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో భారీ హిట్స్ అందుకున్న ఈ భామ ఇక ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొడుతుందా అనేది చూడాలి.
