
రాజమౌళి (Rajamouli) తీస్తున్న “వారణాసి” (Varanasi) సినిమాలో కొంత భాగం రామాయణ ఘట్టాలు ఉంటాయి. ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం. శివ భక్తుడైన రుద్ర అనే వ్యక్తి వారణాసి నగరం నుంచి రామాయణ కాలమైన త్రేతా యుగానికి ఎలా వెళ్తాడు అనేది ఈ సినిమా గాథ.
రుద్ర (మహేష్ బాబు)ని బెదరించి ఒక పని అప్పచెప్పుతాడు కుంభ అనే ఒక విలన్ (పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్ర పోషిస్తున్నాడు). వీరిద్దరూ కలిసి త్రేతా యుగం వెళ్ళినప్పుడు అక్కడ రాముడికి, కుంభకర్ణుడికి యుద్ధం జరగడం, రామాయణ ఘట్టాలు ఉండడం, రాముడిగా మహేష్ బాబు కనిపించడం ఈ సినిమాలో కీలకం.
రాజమౌళి తీసిన యమదొంగ, మగధీర, బాహుబలి చిత్రాలు చూస్తే … ఫ్లాష్ బ్యాక్ లో వేరే కాలం లేదా ప్రాంతంలో జరిగే సన్నివేశాలు ద్వితీయార్థంలో వస్తాయి. యమదొంగలో యమలోకంలో సన్నివేశాలు, మగధీరలో రామ్ చరణ్ వీరుడిగా రాజుల కాలంలో చేసే పోరాటం, బాహుబలిలో మహిస్మతి రాజ్యం సన్నివేశాలు జనాలని ఉర్రుతలూగించాయి.
రాజమౌళి స్క్రీన్ ప్లే పద్దతి ఇదే. రెండో భాగంలో ఒక గంట లేదా అరంగంట కీలకమైన ఎపిసోడ్ ని పెడుతారు. అదీ కూడా ఇంతకుముందు చూడని ఒక కొత్త ప్రదేశంలో కథ పెడుతాడు. సాధారణంగా ఈ ఎపిసోడ్ ఏళ్ల కిందట జరిగిన ఒక గాథ గురించి ఉంటుంది. ఇప్పుడు వారణాసిలో 25 నిమిషాల పాటు త్రేతాయుగం సన్నివేశాలు ఉంటాయి.
రాముడిగా మహేష్ బాబు రూపం, ఆ రామాయణ సన్నివేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే విధంగా ఉంటాయట. ఈ సినిమాకి ఇదే ఎపిసోడ్ బలం. ఇటీవలే ఆ సన్నివేశాలను తీశారు. మోషన్ క్యాప్చర్ యాక్షన్ సన్నివేశాలు తీయడంలో పేరొందిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ Terry Notary ఇటీవలే వానర సేన సన్నివేశాలను చిత్రీకరించారు.
