
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తీస్తున్న ” జైలర్ 2″ (Jailer 2) సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం నెల్సన్ దిలీప్ కుమార్ తిప్పలు పడుతున్నాడు.
జైలర్ 2 చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర కోసం తాజాగా హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ పాత్రను మొదట షారుఖ్ ఖాన్‌కు ఆఫర్ చేశారు. కానీ షారుక్ ఈ అతిథి పాత్రను తిరస్కరించినట్లు తెలిసింది. దాంతో నిర్మాతలు ఈ పాత్ర కోసం హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది
రజినీకాంత్ హీరోగా హిందీలో నటించిన ఒక చిత్రంలో హృతిక్ రోషన్ బాల నటుడిగా కన్పించాడు. మరి ఇప్పుడు రజినీకాంత్ కోసం హృతిక్ ప్రత్యేక పాత్ర ఒప్పుకుంటాడా?
“జైలర్” సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న “జైలర్ 2” విడుదల తేదీ కూడా మారిపోయింది. మొదట ఏప్రిల్ లో అనుకున్నారు. ఆ తర్వాత జూన్ అన్నారు. కొన్నాళ్ళకు ఆగస్టు 15 అని చెప్పారు. తాజాగా దసరాకి విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సీక్వెల్‌లో మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్నారు.
అలాగే బాలకృష్ణతో కూడా ఒక చిన్న పాత్ర చెయ్యించాలి అని ప్రయత్నించారు. కానీ బాలయ్య ఒప్పుకోలేదు.
