
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, వర్క్ లో ఇద్దరూ తెగ పోటీపడతారు. ఒకటి అవకాశాల్ని మరొకరు ఎగరేసుకుపోతుంటారు.
ఈ క్రమంలో తమన్ కు దేవిశ్రీ ప్రసాద్ కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దీనికి అంతే ఇంట్రెస్టింగ్ గా రిప్లయ్ ఇచ్చాడు తమన్.
ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారాడు. “ఎల్లమ్మ” సినిమా చేస్తున్నాడు. మరి తమన్ ఎప్పుడు ముఖానికి రంగేసుకుంటాడు? ఈ ప్రశ్నకు తమన్ స్ట్రయిట్ ఆన్సర్ ఇచ్చాడు. “దేవిశ్రీ ప్రసాద్ కంటే ముందే నేనే హీరో” అంటూ చెప్పుకొచ్చాడు. ‘బాయ్స్’ సినిమాతోనే తను హీరోగా మారానని, దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరో అయ్యాడనే అర్థం వచ్చేలా మాట్లాడాడు తమన్.
‘ఎల్లమ్మ’ స్టోరీ తమన్ కు తెలుసంట. డాలస్ వెళ్లినప్పుడు దిల్ రాజు, తమన్ విమానంలో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారట. అవసరమైతే దేవిశ్రీ ప్రసాద్ కు 2-3 పాటలు కంపోజ్ చేసి ఇవ్వడానికి తను సిద్ధమని, దిల్ రాజుతో చెప్పాడంట తమన్.
