
హీరోయిన్ గా దాదాపుగా 20 ఏళ్ళు ఏలింది కత్రినా కైఫ్ (Katrina Kaif). బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చాలా ఏళ్ళు కొనసాగింది. తెలుగులో కూడా నటించింది. ఐతే, పెళ్లి చేసుకొన్న తర్వాత పూర్తిగా కెరీర్ ని పక్కన పెట్టింది. హీరో విక్కీ కౌశల్ ని పెళ్లాడిన కత్రిన ఇటీవల ఒక బాబుకి జన్మనిచ్చింది.
ఆమె కొడుక్కి ఇప్పుడు ఎనిమిది నెలలు నిండడంతో ఇక ఆమె మళ్ళీ హీరోయిన్ గా రీ-ఎంట్రీ ఇవ్వనుంది అని బాలీవుడ్ మీడియా ఇటీవల వార్తలు ప్రచురించింది. ఇప్పటికే రెండు ఓటిటి కంపెనీలు ఆమెకి కొత్త ప్రపోజల్స్ పెట్టాయిని, రెండు వెబ్ సిరీస్ లు ఆఫర్ చేశాయని ఆ వార్తలు చెప్పాయి.
ఐతే, కత్రినా కైఫ్ టీం మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా ప్రకటించింది. కత్రిన కైఫ్ ఇప్పుడు కెరీర్ గురించి ఆలోచించడం లేదని, రీ-ఎంట్రీ వార్తల్లో నిజం లేదని తెలిపింది ఆమె టీం.
కత్రినా కైఫ్ ప్రస్తుతం తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించడంపైనే ఫోకస్ పెట్టిందట.
