
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే అపప్రధ ఉంది. అందుకే తెలుగు అమ్మాయిలు తమిళ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. శ్రీ గౌరీ ప్రియ కూడా తెలుగులో సూపర్ హిట్ ‘మ్యాడ్’ చిత్రంలో నటించినా ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్ర సీమకి షిఫ్ట్ అయింది.
అక్కడ రెండు సినిమాల్లో పేరు తె
చ్చుకున్న తర్వాత ఇక్కడ ‘చెన్నై లవ్ స్టోరీ’లో నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలయింది. హీరో కిరణ్ అబ్బవరం కన్నా ఈ అమ్మాయి నటనకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.
క్రిటిక్స్ అందరూ ఆమె నటనని మెచ్చుకున్నారు. మొత్తానికి ఈ తెలుగు భామకి రావలసిన గుర్తింపు వచ్చింది.
మరి ఈ సినిమా తర్వాతనైనా ఆమెకి తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.
