
Lust Stories 3 Cast Members: ఆదితి రావు ఇటీవలే పెళ్లి చేసుకొంది. 40 ప్లస్ ఏజ్ లో హీరో సిద్ధార్థ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత తనకు కొత్తగా అవకాశాలు రావట్లేదు అని ఆమె ఇటీవల బాధపడింది.
కానీ ఇప్పుడు ఆమెకి ఒక పెద్ద ఆఫర్ దక్కింది. నెట్ ఫ్లిక్స్… ఆమెకి, ఆమె భర్తకి రెండు వేర్వేరు ప్రాజెక్టులు ఇచ్చింది. ఆమె భర్త సిద్ధార్థ్ ఒక దేశభక్తి చిత్రంలో నటించాడు నెట్ ఫ్లిక్స్ కోసం. ఆమె “లస్ట్ స్టోరీస్” (Lust Stories) సీజన్ మూడులో చోటు దక్కించుకొంది
‘లస్ట్ స్టోరీస్’ పేరులో ఉన్నట్లే సెక్స్ చుట్టూ తిరిగే వెబ్ డ్రామా.
మొదటి సీజన్ లో కియారా అద్వానీ, మనీష కొయిరాలా, రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్, రెండో సీజన్ లో మృణాల్ ఠాకూర్, తమన్నా, కాజోల్, కొంకణా సేన్ శర్మ వంటి హీరోయిన్లు నటించారు. ఇప్పుడు మూడో సీజన్ లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ మరోసారి నటిస్తుండగా, కొత్తగా ఆదితి రావు చేరింది ఈ టీంలో.
ఆదితి రావు తెలుగులో నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. సమ్మోహనం మాత్రమే ఆడింది. “మహా సముద్రం” సినిమా ఆడకపోయినా ఆ షూటింగ్ లో పరిచయం అయిన సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యాభర్తలు. సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు ఇలా వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
