Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

అన్ని కథలకీ క్లైమాక్స్… కల్కి!

Admin, June 18, 2024
Nag Ashwin

ప్రభాస్ హీరోగా రూపొందిన “కల్కి 2898 AD” విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి దర్శకుడు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ కెరీర్ లో ఇది అతి పెద్ద చిత్రం.

ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక చాలా మంది నుంచి వచ్చిన కామెంట్.. అనేక హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేస్తోంది. వాటికి సమాధానం ఇచ్చారు ఈ దర్శకుడు. అనేక పురాణాలు చదివిన తర్వాత హాలీవుడ్ చిత్రాల తరహాలో మన పురాణ గాథలను సైన్స్ ఫిక్షన్ కథల్లా మలచొచ్చు అని భావించాడట నాగ్ అశ్విన్. అలా మొదలైంది ఈ కథ…

ఈ సినిమా గురించి… ఈ సినిమాకి స్ఫూర్తి గురించి ఆయన మాటల్లోనే.

నాగ్ అశ్విన్

“చిన్నప్పటి నుంచి నాకు పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. ‘పాతాళభైరవి’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’ నాకు ఇష్టమైన సినిమాలు. హాలీవుడ్‌ ‘స్టార్‌ వార్స్’ లాంటి సినిమా చూసినప్పుడు చాలా బావున్నాయనిపించాయి. కానీ అలాంటివి ఎప్పుడూ వెస్ట్ లోనే జరగాలా? మన కథలు వద్దా అనిపించేది. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో మహాభారతం పూర్తి అవుతుంది.

అక్కడి నుంచి కలియుగంకు ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనేది పూర్తిగా నా ఊహలో నుంచి పుట్టిన ఆలోచన. ఆ ఆలోచనను కథగా రాయలనుకున్నా. మనం చదివిన పురాణాలు అన్నిటికీ ఒక క్లైమాక్స్ లా ఉంటుంది ఈ కథ.

ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరో యుగంలో దుర్యోధనుడు… ఇలా అన్నిట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా వుంటుందనే ఐడియాతో రాసుకున్న కథ ఇది. రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది.”

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh

Recent News

  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes