
మౌని రాయ్ (Mouni Roy)ఇటీవలే తన భర్తకి దూరం అవుతున్నట్లు ప్రకటించింది. పెళ్లైన నాలుగేళ్ళ తర్వాత మౌని రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ విడిపోతున్నారు. విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యనున్నారు.
వీరికి పిల్లలు కలగలేదు.కానీ తాజాగా కొత్త సినిమాలో తల్లి పాత్ర పోషిస్తోంది. ఆ మూవీ ట్రైలర్ విడుదలైంది. “హై జవానీ తో ఇష్క్ హోనా హై” (Hai Jawani Toh Ishq Hona Hai ) అనే సినిమాలో వరుణ్ ధావన్ సరసన పూజ హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు పూజ హెగ్డే వయసు ఉండే మౌని రాయ్ ఈ సినిమాలో వరుణ్ ధావన్ కి తల్లిగా కనిపించనుంది.
అప్పుడే ఈ భామ తల్లి పాత్రలోకి వెళ్లిపోవడం విచిత్రమే అనిపిస్తోంది కదా. కానీ ఆమె వరుణ్ కి తల్లిగా కాదు ఒక సన్నివేశంలో తల్లిగా నటించేలా ఈ అమ్మడిని తీసుకొస్తారు. అందమైన యువతి తల్లిగా యాక్ట్ చెయ్యడమే ఈ సినిమాలోని కామెడీ.
ఐతే, ఈ ట్రైలర్ ఆమె విడాకుల ప్రకటన తర్వాత రావడంతో సోషల్ మీడియాలో అందరూ ఆమె విడాకులు తీసుకున్న తర్వాత తల్లి అయింది అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
ఇంకా 40 నిండని ఈ భామ త్వరలోనే చిరంజీవి సరసన “విశ్వంభర”లో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసింది.
