
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఎన్నో క్లాసిక్స్ తీశారు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 వంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. “మాయాబజార్” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత అనేక చిత్రాలు తీశారు. 94 ఏళ్ల వయసులో అయన డైరెక్ట్ చేసిన చిత్రం… ‘సింగ్ గీతం’ (Sing Geetham).
సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ల పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చతురంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషించారు. ఆదివారం ర్స్ మీట్ అవర్ వైజాగ్ హీరో అనే ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తాను ఈ సినిమాలో లేడి విలన్ గా నటిస్తున్నాను అనే విషయాన్ని బయటపెట్టింది శాలిని కొండేపూడి (Shalini Kondepudi).

” ఈ సినిమాలో నేను ‘రేణు’ పాత్రలో కనిపించబోతున్నాను. ఇది చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉండే పాత్ర. ఇలాంటి విలన్ పాత్రను మీరు ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. మా ఇంట్లో వాళ్లు నన్ను చూసి ‘నీలాంబరి తర్వాత నువ్వే’ అని సరదాగా అంటుంటారు సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను,” అని తెలిపింది.
