
కొంతమందితో కొన్ని రకాల అనుబంధాలు అలా కలిసిపోతుంటాయి. ఇది కూడా అలాంటిదే. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రభాస్ (Prabhas), దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మధ్య పెనవేసుకున్న అనుబంధం చాలా అరుదైనది. ఈ విషయాన్ని దేవిశ్రీ ప్రసాదే చెబుతున్నాడు. ప్రభాస్ తో తనది చాలా స్పెషల్ బాండింగ్ అనేది దేవి మాట.
“డార్లింగ్ గ్రిల్ చికెన్ చెప్పు అనేవాడు ప్రభాస్. నేను 2-3 గ్రిల్ చికెన్ ఆర్డర్ ఇచ్చేవాడ్ని. ఆ చికెన్ ను నా బెడ్ పై పెట్టి, బకాసురుల్లాగా అందరూ చుట్టూ కూర్చునేవారు. ఒక్కొక్కరు పెద్దపెద్ద ముక్కలు తీసుకొని తినేవాళ్లం. వర్షం సినిమా టైమ్ లో మా అల్లరి పీక్స్. ఇప్పటికీ ప్రభాస్-నేను ఫోన్ లో మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటాం.”
ఇలా ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో అల్లరి చేశారంట. ప్రభాస్ తో చేసిన ప్రతి సినిమాకు తను బాగా ఎంజాయ్ చేశానని, ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుందని అంటున్నాడు డీఎస్పీ. ప్రభాస్ ఒకప్పుడు బాగా తినేవాడని, కానీ ఇప్పుడు కంప్లీట్ గా డైట్ కంట్రోల్ చేస్తున్నాడని అన్నాడు.
రీమిక్స్ సాంగ్స్ పై మరోసారి సూటిగా స్పందించాడు ఈ కంపోజర్. వేరే వాళ్లు కంపోజ్ చేసిన పాటను మన పాటగా సినిమాల్లో చూపించడం వ్యక్తిగతంగా తనకు నచ్చదని, రీమేక్స్ చేయకూడదని నియమం పెట్టుకున్నానని అన్నాడు. కేవలం ఈ రూల్ వల్ల చాలా సినిమాలు వదులుకున్నట్టు తెలిపాడు దేవి.
