Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Mrunal Thakur: ఈ ఏడాది చాలా రిలీజులు

TeluguCinema, March 10, 2026March 10, 2026
Mrunal Thakur

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ ఏడాది మనలని చాలా సినిమాలతో పలకరించనుంది. ఈ ఏడాది ఇప్పటికే ఒక బాలీవుడ్ చిత్రాన్ని విడుదల చేసింది. ఒక తెలుగు సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఇక రెండు నెలల గ్యాప్ తర్వాత మరో హిందీ సినిమా రానుంది థియేటర్లలోకి. అంటే మొదటి ఆరు నెలల్లోనే మూడు సినిమాలు.

చాలా కాలంగా షూటింగ్ లోనే ఉన్న “హే జవానీ తో ఇష్క్ హోనా హై” (Hai Jawani Toh Ishq Hona Hai) అనే చిత్రం ఎట్టకేలకు విడుదల నోచుకుంటోంది. ఈ సినిమాని June 12న విడుదల చెయ్యనున్నారు.

వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో పూజ హెగ్డే కూడా ఒక హీరోయిన్. ఈ ఏడాది ఆమెకి ఇది రెండో హిందీ మూవీ అని చెప్పాలి. ఫిబ్రవరి లో “దో దీవానే షహర్ మే” చిత్రం విడుదలై దారుణంగా పరాజయం పాలు అయింది. మరి ఈ రెండో హిందీ విడుదలైనా ఆమెకి ఈ ఏడాది బాలీవుడ్ లో హిట్ తెస్తుందా అనేది చూడాలి.

ఇక తెలుగులో ఆమె అడవి శేష్ సరసన నటించిన “డెకాయిట్” కూడా రెండుసార్లు వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చేనెల 10న విడుదల కానుంది.

ఈ మూడు సినిమాలు కాకుండా “పూజ మేరీ జాన్” (Pooja Meri Jaan) అనే మరో హిందీ సినిమా ఈ ఏడాది విడుదలకు నోచుకునే అవకాశం ఉంది. ఈ సినిమా 2022లో షూటింగ్ పూర్తి చేసుకొంది. కానీ అనేక కారణాల వల్ల ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ ఏడాది ఎలాగైనా రిలీజ్ చేస్తామని నిర్మాతలు అంటున్నారు. ఆ విధంగా చూస్తే 2026లో నాలుగు సినిమాలు ఆమెవి విడుదల అయ్యేలా ఉన్నాయి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?

Recent News

  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
  • Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes