
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కువైట్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది. అక్కడి పరిస్థితి చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
కువైట్ నుంచి ఇండియాకు తిరుగు ప్రయాణం కోసం విమానం ఎక్కే సమయంలో ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యానని ఉర్వశి వెల్లడించారు. ఆ క్షణంలో తనకు తీవ్ర ఒత్తిడి అనిపించి కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని తెలిపారు.
ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అప్డేట్ చేశారు. ఆమె విమానం ఎక్కే సమయంలో ఉర్వశి కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించిన వీడియో వైరల్ అయింది. తరువాత మరో అప్డేట్‌లో తాను సురక్షితంగా భారత్‌కు చేరుకున్నానని ఉర్వశి అభిమానులకు తెలియజేశారు.
తెలుగులో బాలయ్యతో రెండు సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక పాట చేసింది. రామ్ తో ఒక పాట చేసింది. తెలుగులో ఐటెం గాళ్ గా పాపులర్ అయిన ఈ బాలీవుడ్ భామ ఎక్కువగా కువైట్, దుబాయ్ వంటి ప్రాంతాలకు చక్కర్లు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు వార్ నేపథ్యంలో ఆమె మిడిల్ ఈస్ట్ ట్రిప్స్ కి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే.
