
ఎన్టీఆర్ (NTR) సినిమాల విషయంలో ఇంతకుముందు ఎప్పుడూ ఇన్ని రూమర్లు రాలేదు. కానీ డ్రాగన్ (Dragon) విషయంలో మాత్రం అలా జరుగుతోంది. ఈ సినిమా ఆగిపోయింది అని ఒకసారి పెద్ద ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి షూటింగ్ నిలిచిపోయింది అని పుకారు షికారు చేసింది.
ఇన్ని రూమర్లు ఎందుకు వస్తున్నాయి. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు కానీ “డ్రాగన్” అనే పేరు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. కానీ ఆమె పేరుని కూడా మేకర్స్ ప్రకటించలేదు.
అధికారికంగా ఒక్క ప్రకటన లేకుండా షూటింగ్ చేస్తూ, ఆపుతూ వెళ్తుండడంతో అనేక రూమర్లు మొదలవుతున్నాయి. తర్వాత వాటిని నిర్మాణ సంస్థ తోసిపుచ్చాల్సి వస్తోంది.
ఇటీవలే ఎన్టీఆర్ కి దారుణమైన పరాజయం దక్కింది “వార్ 2” సినిమా రూపంలో. దాంతో ఎన్టీఆర్ మరింత కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఐతే, తన సినిమాల విషయంలో ఎన్టీఆర్ సరైన PR మైంటైన్ చెయ్యడం లేదు. పబ్లిసిటీ కూడా సరిగా ఉండడం లేదు. అందుకే, కాబోలు రకరకాల ప్రచారాలు. సరైన సమాచారం మీడియాకి ఇవ్వలేకపోవడంతో నెగెటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవుతోంది.
