
అడివి శేష్ (Adivi Sesh) తన కొత్త సినిమా “డెకాయిట్” (Dacoit) విషయంలో చాలా ధీమాగా ఉన్నాడు. “డెకాయిట్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో డౌట్ లేదు,” హీరో వెంకటేష్ అన్నారు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో .
“డెకాయిట్ ప్రాణం పెట్టి చేశాను. సినిమా అట్మాస్ థియేటర్లో చూశాను. చాలా బాగా అనిపించింది. ఏప్రిల్ 10 మీరందరూ కూడా ఒక హానెస్ట్ సినిమాను చూస్తారు. మా పాషన్ ని చూస్తారు,” అని అడివి శేష్ అన్నాడు అదే ఈవెంట్ లో.
సినిమాపై శేష్ చాలా నమ్మకంగా ఉన్న మాట వాస్తవమే. కానీ ధీమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ రావడం ముఖ్యం. సినిమా థియేటర్లో నిలబడేలా చెయ్యడం మరీ అవసరం.
శేష్ తన సినిమాలను చాలా ఆలస్యం చేస్తాడు అనేఅపవాదు ఉంది. రీషూట్లు అని నెలల తరబడి సినిమాని పొడగిస్తాడు అని అంటారు. నిన్న స్టేజ్ పై పలువురు నిర్మాతలు అదే మాట అన్నారు. క్వాలిటీ కోసం కాంప్రమైజ్ అవ్వడు శేష్. అందుకే, ఈ అపవాదు. ఐతే, ఈ సినిమా ఖర్చు చాలా ఎక్కువ అయింది ఎందుకంటే ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకొని చాలా భాగం చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత శృతి తప్పుకొంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది.
దాంతో శృతి హాసన్ సీన్ల కోసం పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయింది. ఈ ఖర్చు రావాలంటే సినిమా పెద్ద హిట్ కావాలి. మరి శేష్ ధీమా నిజం అవుతుందా?
