
హైదరాబాద్ లో వేసవి మంటలు మండిపోతున్నాయి. ఎండలో బయటికి అడుగుపెట్టాలంటే దడ పుడుతోంది. దాంతో, పలువురు పెద్ద హీరోలు ఈ వేసవిలో అవుట్ డోర్ షూటింగ్ లు వద్దని నిర్మాతలకు చెపుతున్నారు. దాంతో చాలా సినిమాల షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలు విహార యాత్రల( 2026 Summer Vacation)కు వెళ్తున్నారు. నెల రోజుల పాటు షూటింగ్ లకు బ్రేక్ పడుతుంది.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాని కొన్ని రోజుల పాటు షూటింగ్ నిలిపి వేశారు. ఇక రాజమౌళి తీస్తున్న “వారాణసి” షూటింగ్ హైదరాబాద్ షెడ్యూలు ముగిసింది. మళ్ళీ నెల తర్వాత మొదలవుతుంది ఇక్కడ. మహేష్ బాబు మొన్నే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తున్న వీడియో చూశాం. ఐతే ఇది విహార యాత్ర కాదు. విదేశాల్లో షూటింగ్ కోసం మహేష్ బాబు వెళ్ళాడు. ఆ షెడ్యూల్ పూర్తి కాగానే మహేష్ బాబు, కుటుంబంతో కలిసి నెల రోజుల పాటు వెకేషన్ లో ఉంటాడు.
అలాగే ప్రభాస్ సినిమాలు కూడా అదే విధంగా బ్రేక్ పడ్డాయి. ఈ నెలలో జరగాల్సిన ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలోని ఒక కీలక షెడ్యూల్ ఒక నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ ఎండల నుంచి రిలీఫ్ కోసం ప్రభాస్ విహారయాత్ర కోసం యూరప్ వెళ్లారు.
రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” షూటింగ్ ఏప్రిల్ 30కి ముగుస్తుంది. వచ్చే నెలలో కొన్ని రోజుల పాటు రామ్ చరణ్ వెకేషన్ కి వెళ్తారు.
