
దేవర 2 (Devara 2)…అనే సినిమా ఎప్పటికైనా మొదలవుతుందా? అది మొత్తానికి ఆగిపోయినట్లేనా? ఈ ప్రశ్నలు మళ్ళీ పుట్టాయి. దానికి కారణం ఉంది. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) రెండేళ్ల పాటు వెయిట్ చేసి ఇక లాభం లేదని బాలకృష్ణ సినిమా ఒప్పుకున్నాడు.
నందమూరి బాలకృష్ణ–కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందే సినిమాకి వచ్చే వారంలోనే పూజా కార్యక్రమాలు ఉంటాయి. దాంతో, దేవర 2 అటకెక్కినట్లే అనిపిస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న “డ్రాగన్” (Dragon) ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో విడుదల తేదీని 2027 జూన్ 11కి మార్చారు. అంటే ఈ ఏడాది జూన్ లో విడుదల కావాల్సిన సినిమా వచ్చే ఏడాది జూన్ కి పోస్టుపోన్ అయింది. దానికి తోడు ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తీసే “గాడ్ ఆఫ్ వార్”పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
సో.. ఎన్టీఆర్ (NTR) మరో మూడు సంవత్సరాలు పూర్తిగా లాక్ అయిపోయారు. దీంతో “దేవర 2”పై ఇప్పట్లో ఎలాంటి స్పష్టత రావడం కష్టమేనని భావిస్తున్నారు.
