
మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు’ జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం – సాహు
“సెన్సార్ పూర్తి అయింది. వాళ్ళు సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో కలసి అందరూ చూసే సినిమా అని చెప్పారు.ఇది మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. రౌడీ అల్లుడు సినిమాలో కనిపించిన చిరంజీవి గారిని మళ్ళీ చూసినట్లుగా వుందని ఫ్యాన్స్ అంటున్నారు. వింటేజ్ ఛార్మ్ ని గుర్తు చేస్తునే ఇందులో ఆయన నటన చాలా ఫ్రెష్ గా ఉంటుంది.”
ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు – సుస్మిత
“నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. చాలా కొత్త ఛార్మ్ తో కనిపించారు. దీంతో ఆయనకి కాస్ట్యుమ్స్ డిజైన్ చేయడం కూడా మాకు ఈజీ అయ్యింది. అలాగే అనిల్ గారు ఆయన్ని ఒక స్టయిల్ లో చూపించాలని అనుకున్నారు. ఆయన వైపు నుంచి కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అందరం ఒకే విజన్ తో పని చేశాం.”
అన్ని సినిమాలు ఆడాలి – సాహు
“థియేటర్ల సమస్య లేదు. మాకు మా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సంక్రాంతిలో ముందు నుంచి మా సినిమా ఉంది. అయితే ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఒకటో అర థియేటర్స్ తగ్గడం సహజమే. కాకపోతే మా సినిమా వరకూ థియేటర్స్ సమస్య పెద్దగా లేదు. మా సినిమాతో పాటు అన్ని సినిమాలు ఆడాలి.”
వెంకటేష్, చిరంజీవి సీన్లు ప్రత్యేకం – సాహు, సుష్మిత
వెంకటేష్ గారు బిగ్ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫన్ మరింత గా రైజ్ అవుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. ఇక చిరంజీవి గారి క్యారెక్టర్ కి సంబంధించి షేడ్స్ ట్రైలర్ లో చూపించాం. ఆయన క్యారెక్టర్ లో ఫన్ యాక్షన్ ఎమోషన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.. వెంకటేష్ గారు చిరంజీవి గారి మధ్య చాలా అద్భుతమైన కామెడీ సీన్స్ వుంటాయి. ట్రైలర్ జస్ట్ సాంపిల్ మాత్రమే.”
ప్రిమియర్స్ ఉంటాయి, సీక్వెల్ ఉండదు
“మన శంకర వర ప్రసాద్ గారు” సినిమాకి సీక్వెల్ ఉండదు. ఇది ఒక్క సినిమాతోనే ముగిసే కథ. ఇక ప్రీమియర్స్ కూడా ఉంటాయి. జనవరి 11న షోలు వేస్తున్నాం. ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ వచ్చాక ప్రకటిస్తాం.”
