
2025లో రష్మిక మందాన ఏకంగా ఐదు సినిమాలు విడుదల చేసింది. హిందీలో “చావా”, “సికిందర్”, “తమ్మా” సినిమాలు విడుదల కాగా, తెలుగులో “కుబేర”, “ది గర్ల్ ఫ్రెండ్” వచ్చాయి. ఒకటి తప్ప అన్నీ హిట్ లేదా యావరేజ్ అనిపించుకున్నాయి. ఇక 2026లో ఆమె కెరీర్, జీవితం సరికొత్తగా ఉండబోతున్నాయి.
ఆమె ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసుకోబోతుంది. ప్రియుడు, హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె పెళ్లి 2026 ఫిబ్రవరిలో జరగనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం పూర్తి అయింది.
ఇక కెరీర్ పరంగా చూసుకుంటే హిందీలో ఒక పెద్ద సినిమా, తెలుగులో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అవి వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే విడుదల అవుతాయి.
హిందీలో షాహిద్ కపూర్ సరసన ఒక సినిమా చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక చిత్రం, అలాగే “మైసా” అనే మరో చిత్రంలో నటిస్తోంది. కొత్తగా చేసే సినిమాలు అన్నీ పెళ్లి తర్వాతే ఉంటాయి.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుందట.
