
అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) తెలుగులో చాలా సినిమాలకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలతో పాటు నాని, విజయ్ దేవరకొండ వంటి యువ హీరోలకు కూడా మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే అట్లీ, లోకేష్ కనగరాజ్, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులతో ప్రత్యేక బంధం ఉంది అనిరుధ్ రవిచందర్ కి.
ఐతే, అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో తీస్తున్న “రాకా” చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ని తీసుకోలేదు. అతని స్థానంలో సాయి అభ్యంకర్ తో పని చేస్తున్నాడు. దాంతో అల్లు అర్జున్, అనిరుధ్ కాంబినేషన్ మిస్ అయింది.
కానీ ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన కొత్త చిత్రానికి (AA23) అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తాడు అని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ కి కథ చెప్పి ఆ సినిమాని అధికారికంగా ప్రకటించాడు లోకేష్ కనగరాజ్.
త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ముందే పాటల రికార్డింగ్ పూర్తి చేస్తారట.
