
జగపతి బాబు, లయ జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర… ‘వదలా’ (Vadhala)తో రాబోతున్నారు. ఈ చిత్రంలో యువ నటి హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా గ్లింప్స్ వీడియో విడుదల అయింది.
“అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా భోపాల్ లో చేశాం. అక్కడి ప్రభుత్వానికి ధన్యవాదాలు. భరద్వాజ గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ 24 గంటలు పనిచేస్తున్నారు. లయ నా డియర్ ఫ్రెండ్. మనోహరం సినిమా చేసినప్పుడు తను చాలా చిన్న పిల్ల. తర్వాత హనుమాన్ జంక్షన్ చేశాం. వదలాలో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఉంది.ఆముద పాత్రలో హ్రితిక కూడా చాలా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కచ్చితంగా మంచి హిట్ కొట్టగలమనే నమ్మకం ఉంది,” అన్నారు జగపతిబాబు.
హీరోయిన్ లయ ఇలా అన్నారు: “ఇలాంటి కథ ఇంతకుముందు వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు. జగపతిబాబు గారితో మనోహరం సినిమా చేశాను ఆ సినిమా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.”
తమ్మారెడ్డి భరద్వాజ: ” సినిమా తీసి దాదాపుగా పది సంవత్సరాలు అవుతోంది. సినిమా అంటే భయపడుతున్న సమయంలో కిషోర్ గారు వచ్చే సినిమా చేద్దామన్నారు. జగపతి బాబు గారికి కథ చాలా నచ్చింది కథ పై నమ్మకంతో మొదలుపెట్టాం. జగపతిబాబు గారు ఈ సినిమాకి ఒక నిర్మాత కంటే ఎక్కువగా పని చేశారు.”
