
Lavanya Tripathi about Sathi Leelavathi and her career: లావణ్య త్రిపాఠి ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొంది. వీరికి గత డిసెంబర్లో ఒక బాబు జన్మించాడు. కొడుక్కి ఐదు నెలలు నిండడంతో లావణ్య త్రిపాఠి మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
ఆమె గర్భవతి కాకముందే “సతీలీలావతి” (Sathi Leelavathi) సినిమా మొదలుపెట్టింది. ప్రెగ్నెంట్ కావడంతో దాన్ని త్వరత్వరగా పూర్తి చేసింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 6న విడుదల కానుంది. దాంతో ఆమె తాజాగా ప్రమోషన్స్ మొదలుపెడుతుంది.
తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తూనే కొత్తగా సినిమాలు ఒప్పుకుంటాను అని చెప్పింది. “బాబుతోనే ప్రస్తుతం సమయం అంతా గడిచిపోతుంది. అందుకే కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత కొత్త సినిమాలు సైన్ చేస్తాను. అన్ని రకాల సినిమాలు చెయ్యాలి. తల్లి అయినంత మాత్రానా సినిమాలకు గుడ్ బై చెప్పక్కర్లేదు,” అని తెలిపింది.
వరుణ్ కి భార్య కావడం తన అదృష్టమని పేర్కొంది.
