
Nikhil Siddhartha at Swayambhu teaser launch event: వరుసగా ఫ్లాపులు వస్తే ఏ హీరోకైనా దడ పుడుతుంది. పెద్ద మాస్ హీరోల సంగతి ఎలా ఉన్నా మిగతా వారి మార్కెట్, క్రేజ్ పడిపోతుంది. అందుకే, యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కి కూడా భయం పట్టుకొంది తన కెరీర్ విషయంలో. “కార్తికేయ 2″తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత విడుదలైన సినిమాలు నిలబడలేదు.
“18 పేజెస్” సో సో అనిపించుకొంది. ఆ తర్వాత విడుదలైన “స్పై” సినిమా దారుణ పరాజయం పాలు అయింది. ఇక “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” ఎప్పుడు వచ్చి పోయిందో తెలియదు. అంత ఘోరంగా ఫ్లాప్ అయింది. అందుకే నిఖిల్ కి తన కెరీర్ విషయంలో ఆందోళన మొదలైంది.
నిఖిల్ కొత్త చిత్రం “స్వయంభు” ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను అంటున్నాడు.
“కార్తికేయ 2 తర్వాత మళ్ళీ అలాంటి కొత్తగా, సంథింగ్ అమేజింగ్ చెయ్యాలనిపించింది. ఒళ్లు దగ్గర పెట్టుకుని, భయపడుతూ చేసిన సినిమా ఇది,” అని స్వయంభు టీజర్ లాంచ్ ఈవెంట్లో పేర్కొన్నాడు నిఖిల్.
