Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్నNagarjuna

TeluguCinema, July 6, 2026July 6, 2026

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన “లెనిన్” (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) నిర్మించారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

“నందు ఈ కథ శ్రీరామపురం నేపథ్యంలో జరుగుతుందని మొదట చెప్పాడు. మా నాన్నగారు కూడా శ్రీరామపురం అనే ఊరిలోనే జన్మించారు. అందుకే ఈ కథతో నాకు మొదటి నుంచే ఒక అనుబంధం ఏర్పడింది. నందు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన కోణం ఉంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి… యుద్ధాలు జరిగాయి. ‘లెనిన్’లో కూడా అలాంటి బలమైన ప్రేమకథ ఉంది. భారతి పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయాలనిపిస్తుంది. ఈ సినిమాకు భారతి పాత్రే హార్ట్‌బీట్‌లాంటిది,” అని నాగార్జున అన్నారు.

“చింటు అన్న (నాగవంశీ)కి మాస్ పల్స్ బాగా తెలుసు (నవ్వుతూ). ఈ సినిమాపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి, ఏపీ మొత్తం ఆయనే స్వయంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ‘లెనిన్’ అనేది సీమ కథ… సీమ మట్టి కథ… అక్కడి మనుషుల కథ… సీమలో జరుగుతున్న మహాభారతం,” అని నాగార్జున ధీమాగా చెప్పారు.

“మొదట్లో అఖిల్ ఈ పాత్రకు సరిపోతాడా? అనే సందేహం నాకు కూడా వచ్చింది. కానీ సినిమా చూసిన తర్వాత ఆ సందేహం పూర్తిగా పోయింది. తెరపై అఖిల్ కనిపించడు… ‘లెనిన్’ మాత్రమే కనిపిస్తాడు. ప్రేక్షకులు లెనిన్ ప్రేమను, అతని పగను కూడా ప్రేమిస్తారు. ఆ పాత్రను తమ హృదయాల్లోకి తీసుకెళ్తారు. మనందరికీ వెంకటేశ్వర స్వామి ఎంత గొప్ప దేవుడో… అలాగే ఈ ప్రేక్షకులే మా దేవుళ్లు. ఆ ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా చెబుతున్నాను… జూలై 10న వస్తున్నాం… మనవాడు గట్టిగా కొట్టబోతున్నాడు,” అని నాగార్జున అన్నారు.

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

Recent News

  • ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్నNagarjuna
  • అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్నSreeleela
  • ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse
  • Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes