Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రానా సరసన కేజీఎఫ్ బ్యూటీ!

Admin, June 24, 2024
Srinidhi Shetty

రానా నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఈమధ్య “కల్కి” సినిమాకు ప్రచారం చేస్తున్నాడు తప్ప, తన సినిమా సంగతులు చెప్పడం లేదు ఈ ఆజానుబాహుడు. ఆమధ్య తేజ దర్శకత్వంలో సినిమా ప్రకటించాడు రానా. దానికి “రాక్షస రాజు” అనే పేరు కూడా పెట్టారు. కానీ ఆ మూవీ మేటర్ ఎటూ తేలలేదు.

అంతకంటే ముందు హిరణ్యకశ్యప ప్రకటించాడు. అది కూడా హోల్డ్ లో పడినట్టు కనిపిస్తోంది. ఇప్పుడీ హీరో మరో సినిమా ప్రకటనతో రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త దర్శకుడితో సినిమాకు రానా ఓకే చేసినట్టున్నాడు. బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయబోతున్నారు.

ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

ఈ ముద్దుగుమ్మ ఆల్రెడీ తెలుగులో “తెలుసు కదా” అనే సినిమాలో నటిస్తోంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి కావొస్తోంది. ఇప్పుడు రానా సినిమా కూడా ఓకే ఐతే ఆమెకి మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం.

Srinidhi Shetty

కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టికి సరైన సినిమాలు పడలేదు. నిజానికి ఆమెకు క్రేజీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం చూసి చాలామంది వెనక్కు వెళ్లిపోయారు. అలా కెరీర్ లో గ్యాప్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలకు సైన్ చేస్తోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

Recent News

  • Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna
  • పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్
  • నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes