
Yash and Toxic Movie: ప్రస్తుతం ఎక్కువ క్రేజ్, హైప్ ఉన్న చిత్రం… ధురంధర్ 2. రెగ్యులర్ బాలీవుడ్ మార్కెట్ లోనే కాదు, సౌత్ ఇండియాలో కూడా “ధురంధర్ 2″పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, ఆ సినిమాతో పోటీపడేందుకు ఇతర హీరోలు భయపడుతున్నారు. మన తెలుగు హీరోలు రామ్ చరణ్, నాని, అడివి శేష్ తమ సినిమాలను మార్చి విడుదల నుంచి వాయిదా వేశారు.
“ధురంధర్” వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు అందుకొంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో కూడా బాగా పాపులర్ అయింది. అందుకే రెండో భాగమైన “ధురంధర్ 2” మార్చి 19న విడుదల అవుతోంది అంటే ఇప్పటి నుంచే క్రేజ్ ఎక్కువ అయింది.
అయినా ఈ సినిమాతో పోటీ పడే విషయంలో కన్నడ సూపర్ స్టార్ యష్ వెనక్కి తగ్గడం లేదు. తన చిత్రం “టాక్సిక్” వాయిదా వేసే ప్రసక్తి లేదు అని తేల్చేశాడు. మార్చి 19న టాక్సిక్, ధురంధర్ 2 రెండూ విడుదల కానున్నాయి.
కేజీఎఫ్ 2″ తర్వాత తనకు ఉన్న ఇమేజ్, పాపులారిటీ వేరు కాబట్టి తాను ఇంకో హీరోకి భయపడలా అని యష్ భావిస్తున్నాడు. హిందీ చిత్రాలను చూసి సౌత్ సినిమాలు వెనక్కి తగ్గకూడదు అని అంటున్నాడు యష్.
తన సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద హిట్ అవుతుంది అని యష్ అంటున్నాడు. ఈ సినిమాకి అతను సహ నిర్మాత.
