మరి మురుగదాస్ నిర్ణయమేంటో?

AR Murugadoss and Ram

హీరో రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’తో తన మార్కెట్ ని పెంచుకున్నాడు. ఇప్పుడు తమిళ్ దర్శకులు కూడా రామ్ వెంట పడుతున్నారు. ఇప్పటికే లింగుస్వామి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుంది. కీర్తి శెట్టి హీరోయిన్.

అలాగే, ‘గజిని’, ‘స్టాలిన్’, ‘తుపాకి’ వంటి పెద్ద సినిమాలు తీసిన మురుగదాస్ కూడా ఇటీవల రామ్ ని కలిసి వెళ్లారు. ఒక స్టోరీలైన్ కూడా చెప్పారు. రామ్ తో సినిమా చేయాలనుంది అని మురుగదాస్ తనంతట తానే చెన్నై నుంచి హైదరాబాద్ రావడం విశేషం. ఐతే కలిసి నెల రోజులు అయింది కానీ దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

రామ్ తో పాటు తమిళంలో కూడా ఒక పెద్ద హీరో డేట్స్ కోసం మురుగదాస్ వెయిట్ చేస్తున్నాడు. మరి రెండింట్లో ఏది ముందు స్టార్ట్ చేస్తాడో తెలీదు. మురుగదాస్ నిర్ణయం ఏంటని అటు రామ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట.

రామ్ ఇప్పటికే మిడిల్ రేంజ్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకో స్టెప్ పైకి ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకుముందు త్రివిక్రమ్ ని కలిసి సినిమా గురించి చర్చ చేసిన విషయం అందరికి తెలిసిందే.

Advertisement
 

More

Related Stories