
అక్కినేని నాగార్జున తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించారు. అనేక చిత్రాల్లో అతిధిగా కూడా కనిపించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు, ఆయన పోషించిన స్పెషల్ రోల్స్, అతిధి పాత్రలు లెక్కిస్తే ఇప్పటికే సెంచరీ కొట్టేశారు. కానీ నాగార్జున ఇంకా తన 100 చిత్రాల మార్క్ దాటలేదు అంటున్నారు.
నాగార్జున లెక్క ప్రకారం తాను ఇప్పటివరకు 96 సినిమాల్లో మాత్రమే నటించాను అంటున్నారు. అందుకే 100వ సినిమా మాటని దాటేస్తున్నారు. ఆయన ఎలా లెక్క పెడుతున్నారో మరి.
ఇటీవలే “నా సామి రంగ” చిత్రంతో ఓ మోస్తరు విజయం అందుకున్న నాగార్జున తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తారు. ఇందులో ధనుష్ హీరో కాగా నాగార్జున కీలక పాత్ర పోషిస్తారు. ఇక 2025 సంక్రాంతికి “బంగార్రాజు 2” విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను కూడా కలిపినా నాగార్జున లెక్క ప్రకారం 100 అవదు.
మరి ఆయన తన 100వ చిత్రంగా దేన్నీ ప్రకటిస్తారో చూడాలి.