
బాలీవుడ్ స్థాయిలో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటికే చాలామంది హిందీ హీరోయిన్లు ప్రభాస్ అంటే ఇష్టమని ప్రకటించారు. సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు హీరోలు కూడా అదే మాట అంటున్నారు. ప్రభాస్ తన డార్లింగ్ అంటున్నాడు హీరో రణబీర్ కపూర్.
“సౌత్ ఇండియన్ సినిమాకు నేను పెద్ద అభిమానిని. రజనీ, కమల్, చిరంజీవి సినిమాలు చాలా చూశాను. పవన్ కల్యాణ్ స్వాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్, రామ్ చరణ్ నాకు మంచి ఫ్రెండ్స్. సినిమా అంటేనే సెలబ్రేషన్స్. అదొక పెద్ద ఎంటర్ టైన్ మెంట్. అది నాకు సౌత్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే సౌత్ సినిమా అంటే నాకిష్టం.”

ఇలా చాలామంది హీరోల పేర్లు చెప్పిన రణబీర్.. బాగా ఇష్టమైన ఒక హీరో పేరు చెప్పమన్నప్పుడు మాత్రం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్నాడు. పైగా డార్లింగ్ ప్రభాస్ అంటూ మెచ్చుకున్నాడు.
“నా డార్లింగ్ ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు నాకు మంచి స్నేహితుడు. ఇంతకుముందే చెప్పినట్టు ఎన్టీఆర్, చరణ్ తో పాటు చాలామంది నాకిష్టం. కానీ ఒకే ఒక్క నటుడ్ని సెలక్ట్ చేసుకోమంటే మాత్రం అది ప్రభాస్ మాత్రమే.”
స్టార్ డమ్ తో మాత్రమే కాదు, తన మంచి మనసు, ఫ్రెండ్లీ నేచర్ తో అందర్నీ ఆకట్టుకుంటాడు ప్రభాస్. క్రేజ్ తో పాటు ప్రభాస్ వ్యక్తిత్వం చాలామందికి ఇష్టం. అందుకే రణబీర్ కూడా ప్రభాస్ సింప్లిసిటీకి, స్నేహానికి పడిపోయాడు.