200 రోజుల కాల్షీట్లు ఇచ్చిన ప్రభాస్

Prabhas

ప్రభాస్ నటిస్తున్న పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది… ‘రాధేశ్యామ్’. అలాగే, ‘ఆదిపురుష్’ అనే మరో భారీ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఒక విధంగా చెప్పాలంటే… ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ చెయ్యాల్సిన చిత్రాలు రెండే. ఒకటి ‘సలార్’, మరోటి ‘ప్రాజెక్ట్ K’.

‘కేజేఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టింది. ఇక వచ్చే ఏడాది ప్రభాస్ ఫోకస్ అంతా ‘ప్రాజెక్ట్ K’పైనే. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. 300 వందల కోట్ల రూపాయలతో భారీగా తీస్తున్న ఈ సినిమాకి ప్రభాస్ దాదాపు 200 రోజుల తన కాల్షీట్లు ఇస్తున్నారట.

ఒక ఏడాది అంతా మీరు మా సినిమా కోసమే టైం కేటాయించాలని నాగ అశ్విన్ ప్రభాస్ ని కోరాడట. కానీ, ‘బాహుబలి’ సినిమాలా ఒకే సినిమా కోసం మొత్తం టైం ఇవ్వలేను అని ప్రభాస్ ఖరాఖండీగా చెప్పారు. దాంతో, కనీసం 200 డేట్స్ ఇవ్వండి అని అడిగితే ఓకే చెప్పారట.

‘సలార్’ షూటింగ్ తో పాటు ‘ప్రాజెక్ట్ కే’ సినిమా చేస్తారు ప్రభాస్. కానీ ఎక్కువ టైం నాగ్ అశ్విన్ కి ఇవ్వనున్నారు ప్రభాస్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్ నటిస్తున్నారు. అమితాబ్ తన సన్నివేశాలకు సంబంధించిన పార్ట్ ఇప్పటికే పూర్తి చేసేశారు.

 

More

Related Stories