వీకెండ్ బరిలో ఆరు చిత్రాలు

- Advertisement -
Natasha Doshi in Kothala Rayudu

సంక్రాంతి సినిమాల హంగామా ముగిసింది. పెద్ద సినిమాలన్నీ మార్చి నుంచి షెడ్యూల్ అయి ఉన్నాయి. దీంతో ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు థియేటర్లపైకి దండెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఈ వీకెండ్ ఓ అరడజను సినిమాలొస్తున్నాయి. వీటిలో కాస్త ఊరు, పేరు తెలిసిన సినిమా “సామాన్యుడు” ఒక్కటే.

విశాల్ హీరోగా నటించిన సినిమా “సామాన్యుడు”. శరవణన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అయితే విశాల్ సినిమాకి ఈ మధ్య క్రేజ్ రావట్లేదు.

శ్రీకాంత్, నటాషా దోషి జంటగా నటించిన ‘కోతలరాయుడు’ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. అటు సునీల్ లీడ్ రోల్ లో ‘అతడు ఆమె ప్రియుడు’ అనే మరో సినిమా కూడా వస్తోంది. ఈ రెండు సినిమాలకు ప్రమోషన్ బాగానే చేస్తున్నారు కానీ, ఆడియన్స్ దృష్టి మాత్రం పడడం లేదు.

వీటితో పాటు ఈ వారాంతం ‘కే3 కోటికొక్కడు’. ‘రియల్ దండుపాళ్యం’, ‘పటారుపాళె’ అనే 3 డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వీటిని జనం పట్టించుకుంటారా అనేది చూడాలి.

 

More

Related Stories