ఏపీలో 50 శాతం

Multiplex screens

అనుకున్నట్లే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ని సినిమా థియేటర్లలో సీటు, సీటుకి మధ్య ఖాళీ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. అంటే… అన్ని థియేటర్లలో 50 శాతం మాత్రమే టికెట్లు అమ్మాలి. సీటు విడిచి సీటు టికెట్లు ఇవ్వాలి. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటిస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఏపీ గవర్నమెంట్ ముందుగా నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే అన్ని సినిమా హాళ్లు కలెక్షన్లు లేక బోసిపోతున్నాయి. ‘వకీల్ సాబ్’ విడుదలైన తర్వాత నాలుగు రోజులు బాగా కలెక్షన్లు కనిపించాయి. ఆ తర్వాత దూకుడు లేదు. ఇక గత వీకెండ్ మరి తక్కువ స్థాయిలో ఉన్నాయి కలెక్షన్లు. పెద్ద హీరో సినిమా చూసేందుకే జనం జంకుతున్నారంటే కరోనా భయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వీకెండ్ ‘ఇష్క్’ వంటి చిన్న సినిమాలు మాత్రమే థియేటర్ల వద్దకు రానున్నాయి.

More

Related Stories