బెడిసికొట్టిన స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్

ఈమధ్య మేజర్ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. రిలీజ్ కు దాదాపు 21 రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. మేజర్ కు మంచి హైప్ తీసుకొచ్చింది. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది. అలా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు అడవి శేష్.

కట్ చేస్తే, అదే స్ట్రాటజీని చార్లీ-777 సినిమాకు కూడా ఫాలో అయ్యారు. కానీ ఇక్కడ రిజల్ట్ తేడా కొట్టింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చార్లీ సినిమా కోసం కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేక షోలు ఏర్పాటుచేశారు. కర్నాటకలోనైతే ఏకంగా 100 ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్ లో చాలామంది ప్రముఖులకు సినిమా చూపించారు.

కానీ ఈ ప్రయత్నాలేవీ సాధారణ ప్రేక్షకుల్ని చార్లీ వైపు నడిపించలేకపోయాయి. సినిమాలో కంటెంట్ బాగుందనే కామెంట్స్ వచ్చినప్పటికీ, ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్లలేదు. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.

కుక్క ప్రధాన పాత్రలో తెరకెక్కింది చార్లీ-777 సినిమా. హీరోకు, కుక్కకు మధ్య అనుబంధాన్ని ఇందులో చూపించారు. మంచు కొండల్ని చూడాలనే కుక్క ఆఖరి కోరికను హీరో తీరుస్తాడు. హీరో ఒంటరితనాన్ని కుక్క దూరం చేస్తుంది. ఇలా కొన్ని భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్నందుకోలేకపోయింది

 

More

Related Stories