బరిలో 8, ఫోకస్ రెండింటిపై

- Advertisement -


ఈ శుక్రవారం ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ రానుంది. పవన్ కళ్యాణ్ సినిమా బరిలోకి దిగితే మిగతా సినిమాలకు థియేటర్లు దొరకవు. అందుకే, రేపే (ఫిబ్రవరి 18) చిన్న చిత్రాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి.

ఈ వీకెండ్ ఏకంగా ఎనిమిది చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’, లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సాహిదేవ్ నటించిన ‘వర్జిన్ స్టోరీ’ ప్రధానమైనవి. ఈ రెండు చిత్రాల విషయంలోనే ఎంతో కొంత కాస్త సందడి కనిపిస్తున్నది.

‘సన్నాఫ్ ఇండియా’ సందేశంతో కూడిన చిత్రం. మోహన్ బాబు డైలాగులు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇక ‘వర్జిన్ స్టోరీ’ పూర్తిగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్. యువతని టార్గెట్ చేసిన చిత్రం. ఈ సినిమా పాటలు బాగున్నాయి.

ఈ రెండింటితో పాటు బడవ రాస్కెల్ అనే అనువాద చిత్రం, విశ్వక్, గోల్మాల్ 2020, సురభి 70MM, బ్యాచ్, నీకు నాకు పెళ్ళంట అనే చిన్న చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి. మరో వైపు, ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ‘డీజే టిల్లు’ రెండో వారంలోకి ఎంటర్ కానుంది.

 

More

Related Stories