నటి సరయూపై కేసు నమోదు

- Advertisement -
Sarayu

‘బిగ్ బాస్ తెలుగు 5’లో కంటెస్టెంట్ గా కనిపించిన నటి సరయూపై పోలీసు కేసు నమోదైంది. ఆమె ఇటీవల ఒక వీడియోలో నటించారు. అందులో ఆమె తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించినట్లు ఉందట. కానీ ఆ వీడియో అంతా అసభ్యతతో కూడి ఉంది అని సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఫిర్యాదు మేరకు ఆ కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కి బదిలీ చేశారు. ఎందుకంటే ఆ బంజారాహిల్స్ పరిధిలోని ఫిలింనగర్లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించారు. సో, కేసు హైదరాబాద్ కి బదిలీ అయింది.

సరయూ యూట్యూబ్ లో సెవెన్ ఆర్ట్స్ పేరుతో ‘పెద్దలకు మాత్రమే’ వీడియోలు చేస్తుంటుంది. అలా ఆమె పాపులర్ అయింది. బూతులు మాట్లాడుతూ హల్చల్ చేసే సరయూకి మంచి ఫాలోయింగ్ ఉంది.

‘బిగ్ బాస్ తెలుగు 5’లో అడుగుపెట్టిన మొదటి వారంలోనే ఆమె ఎలిమినేట్ అయింది.

 

More

Related Stories