
కియారా అద్వానీ అంటే కుర్రకారుకు మహా ఇష్టం. తక్కువ టైంలోనే దేశమంతా పాపులారిటీ తెచ్చుకొంది. లేటెస్ట్ గా “కౌన్ బనేగా కరోడ్ పతి” కంటెస్టెంట్ ఒకరు ఆమెని పెళ్లి చేసుకోవడం నా డ్రీం అని చెప్తున్నాడు. హాట్ సీట్ లో కూర్చున్న ఆ కంటెస్టెంట్ కియారకి పిచ్చ ఫ్యాన్ అంట. ఇంటినిండా ఆమె ఫోటోలు అతికించుకున్నాడు.
ఈ షోకి కూడా తన పాకెట్ లో కియారా ఫోటోని పెట్టుకొని వచ్చాడు. ఇదే విషయాన్నీ హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగితే, ఆమె తన లక్కీ మస్కట్ అని చెప్పాడు. ఆమె ఫోటోని తన జేబులో పెట్టుకోవడం వల్లే కేబీసీ12 దాకా వచ్చాను అని చెప్పాడు. 50 లక్షల దాకా వచ్చాడు.
నీ డ్రీం ఏంటి అంటే కియారని పెళ్లి చేసుకోవడమే అని సమాధానం ఇచ్చాడు. ఇలాంటి ఎంతో మంది కుర్రాళ్ళ మతి పొగుడుతోంది కియారా తన బ్యూటీతో. ఐతే, ఇటీవల కియారా నటిస్తున్న సినిమాలు మాత్రం బాడ్ గా ఉంటున్నాయి.