మీ ఆయనకి డివోర్స్ ఇచ్చేయ్ సమంత!

Samantha

సోషల్ మీడియాలో హీరోయిన్లకు ప్రశంసలే కాదు, ట్రోలింగ్స్ కూడా ఎదురవుతుంటాయి. అన్నింటినీ ఒకేలా తీసుకున్నప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో వాళ్లు కొనసాగగలరు. ఒక్కోసారి వ్యక్తిగతంగా కూడా దూషణలుంటాయి. మరికొన్ని సందర్భాల్లో ఊహించని ప్రశ్నలు, ప్రస్తావనలు కూడా ఎదురవుతుంటాయి. అన్నింటినీ లౌక్యంగా ఎదుర్కొన్నప్పుడే క్రేజ్ వస్తుంది.

తాజాగా సమంతకు కూడా అలాంటిదే ఎదురైంది.

రోజూ ఏదో ఒక కొత్త ఫొటో షేర్ చేసే సమంత, ఈరోజు కూడా ఓ పిక్ పోస్ట్ చేసింది. ఫీలింగ్ గుడ్ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. దానికి నెటిజన్లంతా తమకు తోచిన విధంగా స్పందించారు. ఒక అభిమాని మాత్రం ఫొటోతో సంబంధం లేకుండా తిక్కగా రియాక్ట్ అయ్యాడు. “నాగచైతన్యకు విడాకులు ఇచ్చేయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం” అనేది ఆ పోస్టు సారాంశం.

Also Read: Samantha’s BB4 episode achieves a massive rating

సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు సెలబ్రిటీస్ ఎవరైనా స్కిప్ చేస్తారు. కానీ తెలివైన సమంత మాత్రం స్పందించింది. “అది చాలా కష్టం. ఒక పని చేయ్. నువ్వే చైతన్యను అడుగు,” అంటూ రిప్లయ్ ఇచ్చింది.

Chai Sam

Also Check: Samantha Latest Photos

గట్టిగా క్లాస్ పీకుతుందనుకున్న సమంత, ఇలా చాకచక్యంగా సమాధానం ఇచ్చేసరికి నెటిజన్లు ఫిదా అయ్యారు. సమంతను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ డిస్కషన్ జరిగిన కొద్దిసేపటికే సమంత తన సమాధానాన్ని, సదరు వ్యక్తి పోస్టును డిలీట్ చేసింది.

Related Stories