
ఎవరైనా ఒక్క హిట్ ఇవ్వు దేవుడా అని మొక్కుకుంటారు. కానీ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి మాత్రం ఒక్క ఫ్లాప్ ఇవ్వు దేవుడా అని మొక్కుకున్నాడు.
అవును.. వరుస విజయాలతో విసుగెత్తిపోయిన కోదండరామిరెడ్డి ఒక దశలో ఒక్క ఫ్లాప్ అయినా వస్తే బాగుణ్ను అని ఫీల్ అయ్యారట. మనసులోనే ఫ్లాప్ ఇవ్వాలని దేవుడ్ని కోరుకున్నారట. దర్శకుడిగా వరుసగా 18 హిట్స్ అందుకున్నారు కోదండరామిరెడ్డి. కొన్నేళ్ల పాటు రెడ్డిగారి హవా నడిచింది. ఏ సినిమా చేస్తే అది హిట్. ఎలాంటి ప్రయోగం చేసినా హిట్ అయ్యేది.
న్యాయం కావాలి, అభిలాష, ఖైదీ, రామరాజ్యంలో భీమరాజు, బజార్ రౌడీ, శ్రీరంగనీతులు,ఛాలెంజ్, గూండా, ఇల్లాలు ప్రియురాలు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, విక్కీదాదా, విజేత, నారి నారి నడుమ మురారి, ఇలా ఎన్నో హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు.
అలా ఎన్నో ప్రయోగాలు చేసి, మరెన్నో హిట్స్ అందుకున్న కోదండరామిరెడ్డి.. వరుసగా వస్తున్న హిట్స్ తో విసుగెత్తిపోయారట. అందుకే ఒక్క ఫ్లాప్ రావాలని కోరుకున్నారట.
Also Read: Interview with Mega director Kodandarami Reddy
ఇండస్ట్రీలో ఎవరికైనా ఎత్తుపల్లాలు సహజం. అదే విధంగా కోదండరామిరెడ్డికి కూడా ఫ్లాప్ వచ్చింది. అయితే ఆ ఫ్లాపుల పరంపర ఆగలేదు. ఆ తర్వాత ఒక్క హిట్ దేవుడా అని మళ్ళీ ప్రార్థించినా ఫలితం దక్కలేదు. అలా క్రమక్రమంగా ఆయన దర్శకుడిగా రిటైర్ అయిపోవాల్సి వచ్చింది.