వంశీ ‘పసలపూడి’తో డాక్టరేట్!

డైరెక్టర్ వంశీ అనగానే గుర్తొచ్చేవి ఆయన తీసిన ‘సితార’ వంటి గొప్ప చిత్రాలే కాదు గోదావరి కూడా. ఆయన ఆలోచనల్లో, రచనల్లో, చిత్రాల్లో గోదావరి అణువణువునా ఉంటుంది. గోదావరి ప్రాంతంలో పుట్టి పెరిగిన వంశీ తన రచనలతో తన సొంతూరు పసలపూడికి ప్రాచుర్యం తెచ్చారు.

పసలపూడి’ పేరుతో వంశీ రాసిన కథలు చాలా పాపులర్. ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు. 

తూర్పు గోదావరి జిల్లాలో ‘పసలపూడి’కి సమీపంలోని ‘గొల్లల మామిడాడ’ కె. రామచంద్రారెడ్డి ఊరు. ఆయన 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు.ఇప్పుడు వంశీ ‘మా పసలపూడి కథలు – ఒక పరిశీలన’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రచించి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు.

వంశీ సినిమాలే కాదు రచనలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి.

Advertisement
 

More

Related Stories