కృష్ణంరాజు విగ్రహం ఇదే!

మొహినబాద్ లోని ఫార్మ్ హౌజ్ లో రెబెల్ స్టార్ కృష్ణంరాజు విగ్రహాన్ని ప్రతిష్టించింది వారి కుటుంబం. ఈ నెల 11న కృష్ణంరాజు కన్నుమూశారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన దహన సంస్కారాలు జరిగాయి. దాంతో, అదే స్థలంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.

ఈ రోజు దశదిన ఖర్మ సందర్భంగా ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. కృష్ణంరాజు కళ్లద్దాలతో కూడిన రూపాన్నే విగ్రహంగా మలిచారు.

ఈ 11 రోజులు ప్రభాస్ ఇంటివద్దే ఉన్నారు. అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారట.

మరోవైపు, వచ్చే వారం నుంచి ప్రభాస్ తన షూటింగ్ పనులతో బిజీ కానున్నారు. ‘సలార్’ షూటింగ్ కోసం ఇప్పటికే పది సెట్లు వేసి ఉంచారు. ఇంకా ఆలస్యం చేస్తే నిర్మాతకు నష్టం. అందుకే ఈ వీకెండ్ నుంచి కానీ, వచ్చే వారం నుంచి కానీ షూటింగ్ కి వస్తానని ఇప్పటికే నిర్మాతకు సమాచారం ఇచ్చాడట ప్రభాస్.

 

More

Related Stories