
గాయని సునీత పెళ్లి చేసుకొని ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవలే ఆమె రెండో పెళ్లి చేసుకున్న విషయం మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. లేటెస్ట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ భార్య తనతో ప్రవర్తించిన తీరు గురించి వివరించారు.
ఆమె మాటల్లో…
“నేను ఒక స్టూడియోకి వెళ్ళాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైక్ ని నాకు అందించారు పాట పాడమని. ఆ స్టూడియోలో ఆయన భార్య కూడా ఉన్నారు. పాట పాడి బయటికి వచ్చాక, ఆమె నన్ను పిలిచి ఘోరంగా మాట్లాడారు. ఏంటి మా ఆయన చేతులు ముట్టుకున్నావు. మైక్ తీసుకుంటున్నప్పుడు ఆయన చేతులకు నీ వేళ్ళు ఎందుకు తాకించావు అని అడిగారు.
ఒక సాధారణ చర్యని ఆమె అనుమానంగా, అవమానకరంగా మాట్లాడడంతో ఏమి అనాలో తెలియలేదు. కానీ ఆమె అనుమానపు చూపులు, ఆమె వైఖరి చూశాక తమాయించుకొని గట్టిగానే సమాధానం ఇచ్చాను. కానీ ఇంటికివెళ్ళాక ఆమె అవమానించిన తీరు గుర్తొచ్చి రాత్రంతా ఏడ్చాను.”
ఇలాంటివి చాలా ఉన్నాయని ఆమె తెలిపారు. పాపం, అందంగా ఉండే సింగర్స్ కి ఇలాంటి అనుభవాలు కూడా ఉంటాయి అన్నమాట.

ఇంతకీ, ఆ సంగీత దర్శకుడు ఎవరో?