కొత్త చైతన్య కనిపిస్తున్నాడు!

- Advertisement -
Naga Chaitanya


సమంత నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత నాగ చైతన్య చాలా మారిపోయినట్లు కనిపిస్తోంది. సడెన్ గా తన సినిమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు నాగ చైతన్య. ఒకప్పుడు నాగ చైతన్య సోషల్ మీడియాని పెద్దగా వినియోగించుకోలేదు. అవసరమైనప్పుడు మాత్రమే ట్వీట్ చేసేవారు. సమంత ట్వీట్లతో రెచ్చిపోయేది, చైతన్య అడపాదడపా పోస్ట్ చేసేవారు.

ఇప్పుడు సమంత ట్విట్టర్ ని తగ్గించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువగా ఉంటోంది. ఇక చైతన్య తన సినిమాల ప్రొమోషన్ కి ట్విట్టర్ ని గట్టిగా వాడుతున్నారు. ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచే ఈ పద్దతి మొదలైంది. ఇప్పుడు ‘బంగార్రాజు’ సినిమాకి కూడా అప్పుడే హడావిడి మొదలు పెట్టడం విశేషం.

ఈ రోజు హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ… లేడీస్ ఫస్ట్ అంటూ ఫన్నీగా ట్వీటడం అతని శైలిలో వచ్చిన మార్పు.

సమంతకి డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత నాగ చైతన్య తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు కనిపిస్తోంది. అతని నటనలో కూడా కొంత పరిణతి ఉంది.

 

More

Related Stories