ట్రెండింగ్ లో సందీప్ సినిమా

A1 Express

సందీప్ కిషన్ నటించిన ‘A1 ఎక్స్ ప్రెస్’ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ నిన్న వచ్చింది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది. అంటే, చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ నటించిన ఒక మూవీ ఇంటర్ నెట్ ని షాక్ చేస్తోంది అని చెప్పాలి.

ఈ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందిన తొలి తెలుగు మూవీ. ఇది ఒక ప్రత్యేకత. లావణ్య త్రిపాఠితో ముద్దు సీను కూడా ఉంది. అది కూడా ఈ ట్రైలర్ కి బాగా హెల్ప్ అయినట్లుంది.

సందీప్ కిషన్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా నిర్మాణంలో కూడా పార్టిసిపేట్ చేశాడు. షారుక్ ఖాన్ హాకీ నేపథ్యంలో చేసిన “చక్ దే ఇండియా”లా ఇది తెలుగులో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని సందీప్ భావిస్తున్నాడు.

More

Related Stories